Parlakhemundi: వరుస సైకిల్ దొంగతనాల కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్
Parlakhemundi: పర్లాకిమిడిలో వరుస సైకిల్ దొంగతనాల కేసును ఛేదించిన పోలీసులు. 50 సైకిళ్లు చోరీ చేసిన భబానీ ప్రసాద్ డాష్ అరెస్ట్, 13 సైకిళ్లు స్వాధీనం.
Parlakhemundi: వరుస సైకిల్ దొంగతనాల కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్
పర్లాకిమిడి: పర్లాకిమిడి పోలీసులు వరుస సైకిల్ దొంగతనాల జరుగుతుండడంతో దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపించి కేసును విజయవంతంగా ఛేదించారు. పర్లాకిమిడి పోలీస్ స్టేషన్ లో కేసు నం. 370/2026, సెక్షన్ 303(2) BNS) నిందితుడైన భబానీ ప్రసాద్ డాష్ (52)ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇతను గజపతి జిల్లా, గురాండి పోలీస్ స్టేషన్ పరిధిలోని రణాదేవి గ్రామానికి చెందిన దివంగత చంద్రశేఖర్ డాష్ కుమారుడు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీ మరియు ఇతర ఆధారాలను పరిశీలించడం ద్వారా నిందితుడిని గుర్తించారు. విచారణ సమయంలో, పర్లాకిమిడి పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి వరుసగా సైకిళ్లను దొంగిలించడంలో తన ప్రమేయం ఉన్నట్లు నిందితుడు అంగీకరించాడు.
గత మూడు నెలల్లో సుమారు 50 సైకిళ్లను దొంగిలించాడని, వాటిలో చాలా వరకు వివిధ ప్రాంతాల్లో విక్రయించాడని దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు పోలీసులు 13 దొంగిలించబడిన సైకిళ్లను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు.మిగిలిన సైకిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నిందితుడిని




