Parlakhemundi: లోక్ అదాలత్‌లో 2,782 కేసుల రాజీ మార్గం ద్వారా పరిష్కారం!

Parlakhemundi: ఒడిశా గజపతి జిల్లా పర్లాఖెముండి కోర్టులో జాతీయ లోక్ అదాలత్. 2782 కేసులు పరిష్కరించి రూ.44.34 లక్షల మొత్తం వసూలు చేసినట్లు న్యాయమూర్తులు వెల్లడి.

S.Anil, Gajapati Dst
Published on: 13 Sept 2026 12:53 PM IST
Parlakhemundi
X

Parlakhemundi: లోక్ అదాలత్‌లో 2,782 కేసుల రాజీ మార్గం ద్వారా పరిష్కారం!

Parlakhemundi: గజపతి జిల్లా పర్లాఖెముండి జిల్లా కోర్టులో జాతీయ న్యాయ సేవలు ఆదేశాల మేరకు శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జగదీష్ ప్రసాద్ మహంత్, ఫ్యామిలీ కోర్టు జడ్జీ డాక్టర్ జీవన్ జ్యోతి రథ్ , అదనపు సెషన్స్ జడ్జీ హరప్రసాద్ పట్నాయక్ పాల్గొని వివిధ కోర్టుల నుంచి వచ్చిన 3740వ్యాజ్యాలకుగాను 2782 కేసులను పరిష్కరించి రూ 44,34,384 వసూలు చేశారు.

ఈ కార్యక్రమంలో సివిల్ కోర్టు రిజిస్టర్ సత్యబ్రత‌ రాణా ,మహిళా కోర్టు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) శ్రీమతి రశ్మిత సాహు తదితరులు పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst