Parlakhemundi: నేరేడి బ్యారేజికి వ్యతిరేకంగా పర్లాఖెముండి కలెక్టరేట్ వద్ద ధర్నా!

Parlakhemundi: ఆంధ్రప్రదేశ్ నేరేడి బ్యారేజి నిర్మాణానికి వ్యతిరేకంగా పర్లాఖెముండి కలెక్టరేట్ వద్ద దండకారణ్య వికాస్ మంచ్ నిరసన. ఒడిశా ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్.

S.Anil, Gajapati Dst
Published on: 16 Sept 2026 5:21 PM IST
Parlakhemundi
X

Parlakhemundi: నేరేడి బ్యారేజికి వ్యతిరేకంగా పర్లాఖెముండి కలెక్టరేట్ వద్ద ధర్నా!

Parlakhemundi: వంశధార నదిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేరేడి బ్యారేజి నిర్మాణం చేపడితే ఆందోళనలు ఉదృతం చేస్తామని దండకారణ్య వికాస్ మంచ్ సభ్యులు అన్నారు. మంగళవారం గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రజాప్రతినిధులు , నిర్వాసిత వాసులు శాంతియుత నిరసన చేపట్టారు.

నిరసనలో వికాస్ మంచ్ అధ్యక్షులు గౌరొ త్రిపాఠి మాట్లాడుతూ నేరేడి బ్యారేజి నిర్మాణంలో 106 ఎకరాల ఒడిశా భూమిని కోల్పోడమే కాకుండా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు ముంపుకు గురవుతాయని అన్నారు. నాటి ముఖ్యమంత్రి ఒడియా ప్రజల కోసం ఎన్నో చేస్తున్నామని చెబుతున్నారని, కానీ ఒడియా ప్రజలు మట్టిని కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార నీటిని కాపాడాలని డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు మాట్లాడుతూ నేరేడి బ్యారేజి విషయంలో ఒడిశా ప్రయోజనాలను, ప్రభావిత ప్రాంతాల భూమి, నీటి హక్కులను, వంశధార నది పరిరక్షణను కాపాడటానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వేలాది మంది రైతుల జీవనోపాధి కోల్పోతారని ప్రభుత్వం వినకపోతే పెద్ద సంఖ్యలో ఆందోళనలు చేపడతామని, అరెస్టులకు వెనక అడుగేయమని అన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst