Parlakhemundi: గజపతి జిల్లాలో 13.3 టన్నుల గంజాయి దహనం!
Parlakhemundi: గజపతి జిల్లాలో స్వాధీనం చేసుకున్న 13,346 కిలోల గంజాయిని ఇన్సినిరేటర్ సాయంతో దహనం చేసిన పోలీసులు. ఐజీ జేఎన్ పంకజ్ సమక్షంలో ధ్వంసం.
Parlakhemundi: గజపతి జిల్లాలో 13.3 టన్నుల గంజాయి దహనం!
Parlakhemundi: గజపతి జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి స్వాధీనం చేసుకున్న 13,346.179 కిలోల గంజాయిని పోలీసులు గురువారం దహనం చేశారు. దక్షిణ మండల ఐజీ జె ఎన్ పంకజ్ సమక్షంలో గంజాం జిల్లా సెరగడ ప్రాంతంలో ఉన్న ఇన్సినేటర్ యంత్రం సహాయంతో బూడిద చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ప్రహ్లాద్ సహాని, అబ్కారీ ఎస్పీ ప్రదీప్ కుమార్ సాహు, డీఎస్పీ అమితాబ్ పండా తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Next Story




