Nepal Flash Floods: నేపాల్‌లో భోటేకోశి బీభత్సం.. 105 మంది భారతీయులు గల్లంతు, బీహార్‌కు హైఅలర్ట్!

Nepal Flash Floods: నేపాల్‌లో భోటేకోశి నది ఉద్ధృతితో ఘోర విపత్తు సంభవించింది.

Arun Chilukuri
Published on: 26 Aug 2026 5:25 PM IST
Nepal Flash Floods: నేపాల్‌లో భోటేకోశి బీభత్సం.. 105 మంది భారతీయులు గల్లంతు, బీహార్‌కు హైఅలర్ట్!
X

Nepal Flash Floods: నేపాల్‌లో భోటేకోశి బీభత్సం.. 105 మంది భారతీయులు గల్లంతు, బీహార్‌కు హైఅలర్ట్!

నేపాల్‌లో సంభవించిన మెరుపు వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. చైనా సరిహద్దుల్లోని నేపాల్ రుసువా జిల్లాలో భోటేకోశి నది ఉప్పొంగడంతో భారీ విధ్వంసం సృష్టించింది. ఈ వరదల్లో వందలాది మంది గల్లంతు కాగా, వారిలో 105 మంది భారతీయులు కూడా ఉన్నట్లు నేపాల్ అధికారులు వెల్లడించడం కలకలం రేపుతోంది. వరదల ధాటికి రోడ్లు, గ్రామాలు కొట్టుకుపోవడంతో పాటు 10కి పైగా జలవిద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

టిబెటన్ హిమాలయ ప్రాంతంలో ఉద్భవించే భోటేకోషి నది, నేపాల్ గుండా ప్రవహించి సుంకోషిలో కలుస్తుంది. ఇవన్నీ కలిసి కోషి నదీ వ్యవస్థగా మారుతాయి. నేపాల్ నుంచి భారత్‌లోకి ప్రవేశించే కోషి నదిని "బీహార్ దుఃఖదాయిని" అని పిలుస్తారు. ఈ నది ఉప్పొంగుతుండటంతో బీహార్‌కు పెను ప్రమాదం పొంచిఉంది.

నేపాల్ వరదల నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం సామ్రాట్ చౌదరి సీఎస్, డీజీపీలతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాలను హైఅలర్ట్ చేశారు. గండక్, నారాయణి నదుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story