Dharmendra Pradhan: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!

Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.

Arun Chilukuri
Published on: 25 July 2026 3:58 PM IST
Dharmendra Pradhan
X

Dharmendra Pradhan: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!

Dharmendra Pradhan: జాతీయ ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన వేళ కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాలు, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన సుదీర్ఘ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం (జూలై 25) తన పదవికి రాజీనామా చేశారు.

విద్యాశాఖ జవాబుదారీతనం వహించాలనే తీవ్ర ఒత్తిడి పెరగడంతో ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు. కేంద్రంతో CJP ప్రతినిధుల చర్చలకు ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘ఎక్స్’ వేదికగా ధర్మేంద్ర ప్రధాన్ స్పందన

తన రాజీనామా నిర్ణయంపై సోషల్ మీడియా వేదిక 'X' (ట్విట్టర్) ద్వారా స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్, యువత ఆకాంక్షలను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితులను దేశవ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకోకూడదు. ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. పిల్లలు తమ సమయాన్ని చదువుపై, కెరీర్ నిర్మాణంపైన కేటాయించాలి. అందుకే నా రాజీనామా లేఖను గౌరవ ప్రధానమంత్రికి పంపించాను. — ధర్మేంద్ర ప్రధాన్

NEET-UG పరీక్షల లీకేజీ అంశంపై ఆయన మాట్లాడుతూ.. “తొలి రోజు నుంచే ఈ పరిస్థితికి నేను పూర్తి బాధ్యత వహించాను. అయితే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు విద్యార్థులను పక్కదోవ పట్టించడానికి, అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారు” అని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story