New Delhi: జేపీసీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ బీద మస్తాన్ రావు

New Delhi: న్యూదిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్సీలో జరిగిన కార్పొరేట్ చట్టాల బిల్లు–2026 జాయింట్ కమిటీ సమావేశంలో బీద మస్తాన్ రావు యాదవ్ పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 17 July 2026 8:42 AM IST
New Delhi
X

New Delhi: జేపీసీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ బీద మస్తాన్ రావు

New Delhi: పార్లమెంట్ హౌస్ అనెక్సీలో గురువారం జరిగిన కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లు–2026పై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) సమావేశంలో రాజ్యసభ సభ్యులు, కమిటీ సభ్యులు డాll బీద మస్తాన్ రావు యాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారుల నుంచి బిల్లులోని ప్రతి క్లాజుపై సమగ్ర వివరణను కమిటీ సభ్యులు స్వీకరించారు. అనంతరం క్లాజ్-బై-క్లాజ్ పరిశీలన కొనసాగింది.

ఈ సందర్భంగా డాll బీద మస్తాన్ రావు యాదవ్ బిల్లులో ప్రతిపాదించిన నిబంధనల అమలు, పారదర్శకత, పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణ, కార్పొరేట్ పాలన బలోపేతం వంటి అంశాలపై తన అభిప్రాయాలు, సూచనలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. దేశ ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక రంగానికి తోడ్పడే విధంగా చట్టం మరింత సమర్థవంతంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, జాయింట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE

Next Story