MK Stalin: తమ్ముడు విజయ్.. అవును, నా దవడ విరిగింది: సీఎంకు స్టాలిన్ ఘాటు కౌంటర్

MK Stalin: తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన సంజ్ఞ (Jaw Gesture) రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో..

Arun Chilukuri
Published on: 10 Sept 2026 11:52 AM IST
MK Stalin: తమ్ముడు విజయ్.
X

MK Stalin: తమ్ముడు విజయ్.. అవును, నా దవడ విరిగింది: సీఎంకు స్టాలిన్ ఘాటు కౌంటర్

MK Stalin: తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన సంజ్ఞ (Jaw Gesture) రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. "తమ్ముడు విజయ్.." అంటూ ఆయన విడుదల చేసిన వీడియో సందేశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

1975-77 ఎమర్జెన్సీ కాలంలో డీఎంకే ప్రభుత్వం రద్దయిన సమయంలో తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను స్టాలిన్ గుర్తుచేసుకున్నారు. ఆనాడు జైలులో పోలీసులు, జీవిత ఖైదీల చేతిలో తీవ్ర చిత్రహింసలు అనుభవించామని, రాత్రిపూట నిద్రపోనివ్వకుండా లాఠీలు, బూట్లతో కొట్టారని వెల్లడించారు. ఆ దాడుల్లోనే తన దవడ ఎముకలు విరిగిపోయాయని, నాటి దెబ్బలకు సంబంధించిన గుర్తులు ఇప్పటికీ తన శరీరంలో ఉన్నాయని స్పష్టం చేశారు. తమిళనాడు, తమిళుల కోసం పోరాడిన నాయకులకు ఇలాంటి అణచివేతలు కొత్త కాదని, డీఎంకే చరిత్రలో తాను భాగమైనందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 7న అసెంబ్లీలో డీఎంకే హయాంలోని అవినీతిపై మాట్లాడుతూ విజయ్ తన దవడను పైకెత్తుతూ చేసిన సంజ్ఞ 'బాడీ షేమింగ్' కిందకు వస్తుందంటూ డీఎంకే శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. అయితే, ఆ సంజ్ఞ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, యాదృచ్ఛికంగా జరిగిందని సీఎం విజయ్ వివరణ ఇచ్చినప్పటికీ ఈ వివాదం మరింత ముదిరింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story