Parlakhemundi: మహేంద్రతనయ నదిలో పూజారి గల్లంతు..గజపతి జిల్లాలో విషాదం!
Parlakhemundi: ఒడిశాలోని మహేంద్రతనయ నదిలో స్నానానికి దిగి దుర్గా ప్రసాద్ పాణిగ్రాహి (69) గల్లంతు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు.
Parlakhemundi: మహేంద్రతనయ నదిలో పూజారి గల్లంతు..గజపతి జిల్లాలో విషాదం!
Parlakhemundi: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గుసాని సమితి అమర, కేరండి గ్రామ ప్రాంతంలో ప్రవహిస్తున్న మహేంద్ర తనయ నదిలో ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.
అగ్నిమాపక అధికారి దీరేంద్ర కుమార్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం 5.40గంటల సమయంలో ఆ ప్రాంతానికి చెందిన దుర్గా ప్రసాద్ పాణిగ్రాహి (69) స్నానానికి దిగి లోతు తెలియక గల్లంతయినట్లు తెలిపారు.వృద్ధుడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పరిధిలోని తిడ్డీమి గ్రామ వాసిగా గుర్తించారు.
ఇతను ప్రతిరోజు అమర గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి లలితాదేవి ఆలయంలో పూజలు చేస్తూ ఉంటారని గ్రామస్తులు తెలిపారు.. ప్రస్తుతానికి వృద్ధుడు జాడ ఇంకా తెలియ రాలేదు.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.




