TET Paper Leak : మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ మాస్టర్‌మైండ్ అరెస్ట్

TET Paper Leak : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన..

G Krishna
Published on: 25 July 2026 10:07 AM IST
TET Leak
X

TET Leak

TET Paper Leak : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి, మాస్టర్‌మైండ్‌గా ఉన్న బిజేంద్ర గుప్తాను మహారాష్ట్ర పోలీసులు బీహార్‌లో అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా పోలీసుల కన్నుగప్పి పరారీలో ఉన్న ఇతని కోసం మహారాష్ట్ర పోలీసులు బీహార్‌లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు పక్కా సమాచారంతో చేపట్టిన స్పెషల్ ఆపరేషన్‌లో బిజేంద్ర గుప్తాతో పాటు అతనికి సహకరించిన మరొక నిందితుడిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

నెలల తరబడి డ్రామా.. పోలీసుల ఛేజింగ్

టీఈటీ పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే రంగంలోకి దిగిన మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో భాగముగానే కొన్ని నెలల క్రితం బిజేంద్ర గుప్తా భార్యను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఆ సమయంలో బిజేంద్ర గుప్తా మాత్రం చాకచక్యంగా తప్పించుకుని పరారయ్యాడు. దాంతో ఇతని ఆచూకీ కోసం ఇంటర్-స్టేట్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎట్టకేలకు బీహార్‌లో తలదాచుకున్నట్లు కచ్చితమైన ఇన్ఫర్మేషన్ రావడంతో రాత్రికి రాత్రే దాడి చేసి అతడిని లాక్ చేశారు.

స్ట్రింగ్ ఆపరేషన్‌లో షాకింగ్ నిజాలు.. లీకేజ్ గ్యాంగ్ గుట్టు రట్టు

బిజేంద్ర గుప్తా పేరు కేవలం మహారాష్ట్ర టీఈటీ కేసులోనే కాకుండా, దేశవ్యాప్తంగా జరిగిన పలు ప్రధాన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజీలలో కూడా గట్టిగానే వినిపించింది. గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన 'నీట్' (NEET) పేపర్ లీక్ వివాదం నడుస్తున్న సమయంలో ఒక ప్రముఖ నేషనల్ మీడియా ఛానెల్ చేసిన సీక్రెట్ స్టింగ్ ఆపరేషన్‌లో ఇతని ముఖముసుగు తొలిగింది. ఆ అండర్‌కవర్ ఇన్వెస్టిగేషన్‌లో బిజేంద్ర గుప్తా స్వయంగా పేపర్ లీకేజ్ సిండికేట్ ఎలా పనిచేస్తుందో, ఎగ్జామినేషన్ సిస్టమ్‌లో ఉన్న లొసుగులను ఎలా వాడుకుంటారో స్పష్టంగా బయటపెట్టి షాక్ ఇచ్చాడు.

ట్రాన్సిట్ రిమాండ్‌పై మహారాష్ట్రకు తరలింపు

భారతదేశంలో జరిగే పలు పోటీ పరీక్షల పేపర్లను లీక్ చేయడంలో బిజేంద్ర గుప్తా కీ-రోల్ ప్లే చేశాడని, ఆర్గనైజ్డ్ నెట్‌వర్క్‌ ద్వారా ఎగ్జామ్ సిస్టమ్‌ను దెబ్బతీశాడని ఇన్వెస్టిగేషన్ టీమ్స్ నిర్ధారణకు వచ్చాయి. అందుకే మహారాష్ట్ర టీఈటీ కేసులో ఇతనిని మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం బీహార్‌లో అరెస్ట్ చేసిన ఇతడిని స్థానిక కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ రిమాండ్‌పై మహారాష్ట్రకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పేపర్ లీకేజ్ గ్యాంగ్‌లతో ఇతనికి ఉన్న నెట్‌వర్క్, లింకులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story