గాయపడిన చిరుతను పట్టుకోబోతే ఒక్కసారిగా తిరగబడింది.. అటవీ సిబ్బందిపై దాడి

Leopard: కర్ణాటకలోని దావణగెరెలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిరుత రక్షించబోയ అటవీ సిబ్బందిపై దాడి చేసింది.

Arun Chilukuri
Published on: 9 Sept 2026 10:47 AM IST
గాయపడిన చిరుతను పట్టుకోబోతే ఒక్కసారిగా తిరగబడింది.. అటవీ సిబ్బందిపై దాడి
X

గాయపడిన చిరుతను పట్టుకోబోతే ఒక్కసారిగా తిరగబడింది.. అటవీ సిబ్బందిపై దాడి

Leopard: కర్ణాటకలోని దావణగెరె సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిరుత అటవీశాఖ అధికారులపైకి దూసుకొచ్చిన ఘటన కలకలం సృష్టించింది. బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొనడంతో చిరుత తీవ్రంగా గాయపడింది. నడవలేని స్థితిలో అది రహదారి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. చికిత్స నిమిత్తం తరలించేందుకు వీలుగా దానికి మత్తుమందు ఇచ్చేందుకు అధికారులు దగ్గరికి వెళ్లారు. అప్పటివరకు అచేతనంగా పడి ఉన్న ఆ చిరుత ఒక్కసారిగా పంజా విసిరి వారిపై దాడికి దిగింది.

అటవీశాఖ ఉద్యోగి మరుళసిద్ధప్పను అది వెంబడించడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. మిగిలిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై దానిని కట్టడి చేశారు. అనంతరం చిరుతకు మత్తుమందు ఇచ్చి సురక్షితంగా సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ దాడిలో గాయపడిన అటవీ సిబ్బంది మరుళసిద్ధప్పను చికిత్స కోసం దావణగెరె ఆసుపత్రికి తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story