Ketan Murder Case : చాట్ డిలీట్.. కానీ కాల్ పట్టిచ్చింది..కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ నిజాలు..!

Ketan Murder Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె లోహగఢ్ కోట (Lohagad Fort) హత్య కేసు దర్యాప్తులో రోజుకో షాకింగ్ నిజం వెలుగులోకి వస్తోంది. తన కాబోయే

G Krishna
Published on: 29 Jun 2026 10:14 AM IST
Ketan-Murder-case
X

Ketan-Murder-case

Ketan Murder Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె లోహగఢ్ కోట (Lohagad Fort) హత్య కేసు దర్యాప్తులో రోజుకో షాకింగ్ నిజం వెలుగులోకి వస్తోంది. తన కాబోయే భర్త కేతన్ అగర్వాల్ (25)ను కొండపై నుంచి కిందకు తోసేయడానికి సరిగ్గా 34 నిమిషాల ముందు.. నిందితురాలు సియా గోయల్ (20) తన ప్రియుడు చేతన్ చౌదరితో ‘సీక్రెట్ కాల్’ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి కాల్ డేటా రికార్డ్స్ (CDR) ఆధారంగా పుణె రూరల్ పోలీసులు ఈ కీలక విషయాన్ని కనుగొన్నారు. హత్య ప్లాన్‌ను అమలు చేయడానికి వారు ఇచ్చుకున్న ‘ఫైనల్ సిగ్నల్’ ఇదేనని పోలీసులు భావిస్తున్నారు.

ఆఖరి కాల్.. ఫోరెన్సిక్ దర్యాప్తులో గుట్టురట్టు

సియా గోయల్, చేతన్ చౌదరి మొబైల్ ఫోన్లను సైబర్ వింగ్ , ఫోరెన్సిక్ నిపుణులు లోతుగా పరిశీలించడంతో ఈ డిజిటల్ లూప్‌హోల్ దొరికింది. జూన్ 18న జరిగిన ఈ హత్యకు కొన్ని నిమిషాల ముందు మాట్లాడిన ఆ ఆఖరి కాలే ఈ కుట్రకు అతిపెద్ద ఆధారంగా పోలీసులు పరిగణిస్తున్నారు. కోటలోని ఒక నిర్దిష్ట వ్యూ పాయింట్ (Viewpoint) వద్ద తాము ఉన్నామని, ఆ సమయంలో అక్కడ పర్యాటకులు ఎవరూ లేరని సియా గోయల్ తన ప్రియుడికి ఖచ్చితమైన లొకేషన్‌ను ఆ కాల్ ద్వారా వివరించినట్లు పోలీసులు నమ్ముతున్నారు.

మూడు నెలల చాట్స్ డిలీట్.. రికవరీకి సైబర్ వింగ్ ప్రయత్నాలు

పోలీసులకు దొరకకూడదనే ఉద్దేశంతో వీరిద్దరూ గత మూడు నెలలుగా తాము మాట్లాడుకున్న వాట్సాప్ (WhatsApp), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) చాటింగ్‌లను, వాయిస్ నోట్స్‌ను వెంటనే డిలీట్ చేశారు. అయితే, ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఆ డిలీట్ చేసిన డేటాను రికవరీ చేసేందుకు సైబర్ వింగ్ ప్రయత్నిస్తోంది. కోర్టులో నిందితులకు కఠిన శిక్ష పడేలా.. రికవరీ చేసిన చాట్స్, లొకేషన్ లాగ్స్, ఇంటర్నెట్ ఐపీ (IP) అడ్రస్‌లను బారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103 కింద పక్కా ఆధారాలుగా చూపించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

నవంబర్ పెళ్లి ఇష్టం లేకే దారుణం

నిందితురాలు సియా గోయల్, మృతుడు కేతన్ అగర్వాల్‌కు నవంబర్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని సియా, తన ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను వదిలించుకోవాలని స్కెచ్ వేసింది. సియా సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. చేతన్ ఆడే క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో సియాకు అతనితో మొదటి పరిచయం ఏర్పడింది, ఆ తర్వాత ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వారిద్దరూ మరింత దగ్గరయ్యారు. వీరిద్దరూ కలిసి మే చివరి వారంలోనే కేతన్ హత్యకు ప్లాన్ పూర్తి చేశారు.

మొదటిసారి తప్పించుకున్న కేతన్.. పాము కథ అల్లిన సియా!

ఈ ఘాతుకానికి సియా జూన్ 14నే మొదటి ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది. జూన్ 14న కూడా కేతన్‌ను లోయలోకి నెట్టేయడానికి సియా ప్రయత్నించింది, కానీ కేతన్ అదృష్టవశాత్తూ ఒక పొదను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఆ సమయంలో కేతన్‌కు అనుమానం రాకుండా ఉండేందుకు.. అక్కడ 'పాము' వచ్చిందని, దాన్ని చూసి భయపడి నిన్ను పొరపాటున నెట్టేసానంటూ సియా నమ్మబలికింది.

మొదటి ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో, ఈసారి ఎలాగైనా కేతన్‌ను అంతమొందించాలని జూన్ 18న రెండోసారి ప్లాన్ చేశారు. ఈసారి కేతన్ ఏమాత్రం తప్పించుకోకుండా చూసేందుకు ప్రియుడు చేతన్ చౌదరి కూడా వారిని వెంబడిస్తూ కోటకు వెళ్లాడు. సియా లొకేషన్ కన్ఫర్మ్ చేయగానే.. కేతన్‌ను కొండపై నుంచి కిందకు నెట్టేసి హతమార్చారు. ప్రస్తుతం పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story