PM Modi: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగం విజయవంతం.. ఇస్రోకు ప్రధాని మోదీ అభినందనలు!

PM Modi: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రోను అభినందించిన ప్రధాని మోదీ.

Arun Chilukuri
Published on: 4 Sept 2026 10:50 AM IST
PM Modi
X

PM Modi: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్రయోగం విజయవంతం.. ఇస్రోకు ప్రధాని మోదీ అభినందనలు!

PM Modi: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చరిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 (GSLV-F17) వాహకనౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్‌ వేదికగా అభినందనలు తెలిపారు.

జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ద్వారా జియోసింక్రోనస్ కక్ష్య నుంచి భారత్ ప్రయోగించిన మొట్టమొదటి ఇమేజింగ్ శాటిలైట్ 'ఈవోఎస్-05' (EOS-05)ను సబ్‌-జియో సింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధిస్తున్న సాంకేతిక పురోగతికి, నూతన ఆవిష్కరణలకు ఈ ప్రయోగం నిదర్శనమని ప్రధాని మోదీ కొనియాడారు. ఇస్రో మరియు దేశీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం అంతరిక్ష రంగాన్ని మరింత బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.

ఈ అత్యాధునిక ఉపగ్రహం ద్వారా దేశ భద్రత మరింత పటిష్టం కానుంది. సరిహద్దుల్లో శత్రు దేశాలు రహస్యంగా ఏర్పాటు చేసే సైనిక స్థావరాలను కూడా ఈ శాటిలైట్ ఇట్టే పసిగట్టగలదు. అంతేకాకుండా, భవిష్యత్తులో సంభవించే ప్రకృతి విపత్తులను, వాటి తీవ్రతను ముందస్తుగా అంచనా వేయడానికి ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story