Rock Dam: సింధూ నదిపై భారత్ తొలి రాతి చెక్‌డ్యామ్.. లద్దాఖ్‌లో సాగునీటి కష్టాలకు చెక్!

Rock Dam: లద్దాఖ్‌లోని ఉప్సీ ప్రాంతంలో సింధూ నదిపై భారత్ తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది.

Arun Chilukuri
Published on: 5 Sept 2026 3:54 PM IST
Rock Dam
X

Rock Dam: సింధూ నదిపై భారత్ తొలి రాతి చెక్‌డ్యామ్.. లద్దాఖ్‌లో సాగునీటి కష్టాలకు చెక్!

Rock Dam: లద్దాఖ్‌లోని ఉప్సీ ప్రాంతంలో సింధూ నది జలాలను సమర్థంగా వినియోగించుకునేందుకు భారత్‌ తొలి రాతి (రాక్) చెక్‌డ్యామ్‌ను విజయవంతంగా నిర్మించింది. ఎలాంటి సిమెంట్ ఉపయోగించకుండా కేవలం రాళ్లతో చేపట్టిన ఈ ప్రత్యేక నిర్మాణంతో నదిలో నీటిమట్టం దాదాపు 10 అడుగుల మేర పెరిగింది. అత్యంత లోతులో ప్రవహించే సింధూ నది నీటిని గతంలో పైకి తోడలేక ఇబ్బందులు పడిన స్థానిక రైతులకు ఈ చెక్‌డ్యామ్ ద్వారా సాగునీరు అందే మార్గం సుగమమైంది. సుమారు 40 మిలియన్ లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుతో స్థానిక గ్రామాలకు పెద్దఎత్తున ఉపశమనం లభించింది.

సరిహద్దు ప్రాంతాల్లో నీటి లభ్యతను మరింత పెంచే లక్ష్యంతో లద్దాఖ్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు మరో 36 కొత్త చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో భాగంగా లేహ్‌లో 7, కార్గిల్ రీజియన్‌లో 29 రాక్ చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. రూ.56 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులు పూర్తయితే స్థానికంగా నీటి నిల్వ సామర్థ్యం మరింత బలపడనుంది. పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందం అమలును పూర్తిగా నిలిపివేసిన ప్రస్తుత తరుణంలో ఈ సరిహద్దు జల ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story