Independence Day 2026: తెలుగు రాష్ట్రాల పోలీసులకు కేంద్ర పురస్కారాలు.. ఏపీలో 21, తెలంగాణలో 15 మందికి పతకాలు

Independence Day 2026: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 1,057 మంది పోలీసులకు గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది.

Arun Chilukuri
Published on: 14 Aug 2026 11:06 AM IST
Independence Day 2026
X

Independence Day 2026: తెలుగు రాష్ట్రాల పోలీసులకు కేంద్ర పురస్కారాలు.. ఏపీలో 21, తెలంగాణలో 15 మందికి పతకాలు

Independence Day 2026: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ భద్రతా విభాగాల్లో విశేష సేవలందించిన సిబ్బందికి కేంద్ర హోంశాఖ (MHA) గ్యాలంట్రీ మరియు సేవా పతకాలను ప్రకటించింది. పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, పౌరరక్షణ విభాగాల నుంచి మొత్తం 1,057 మంది సిబ్బందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది.

పతకాల వివరాలు ఇలా:

రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు (President's Medal): 92 మంది

గ్యాలంట్రీ మెడల్స్ (Medal for Gallantry): 301 మంది

విశిష్ట సేవా పతకాలు (Meritorious Service Medal): 664 మంది

గ్యాలంట్రీ పతకాలు సాధించిన 301 మందిలో అత్యధికంగా 197 మంది తీవ్రవాద ప్రభావిత (నక్సల్ ప్రభావిత) ప్రాంతాల్లో పనిచేస్తున్న వారే కావడం విశేషం. జమ్మూకశ్మీర్‌కు చెందిన 51 మంది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 12 మంది పోలీసు అధికారులు కూడా ఈ సాహస పురస్కారాలను అందుకున్నారు. ప్రాణాలకు తెగించి ఆస్తులను, ప్రజలను కాపాడటంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఈ పురస్కారాలు అందజేస్తారు.

ఆంధ్రప్రదేశ్: 21 మందికి పురస్కారాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం 21 మంది అధికారులు ఈ ప్రతిష్టాత్మక పతకాలకు ఎంపికయ్యారు.

రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు (2):

గుడి విజయ్ కుమార్ (ఐజీ)

బలంకారి వెంకట రామిరెడ్డి (ఐజీ)

గ్యాలంట్రీ మెడల్స్ (7): హెడ్ కానిస్టేబుళ్లు కొర్లాన మహేశ్, పైడి శ్రీరామమూర్తి, అడారి హేమసుందర రావు, చింతపల్లి సత్యనారాయణ, రౌతు మహేశ్, ఆబోతుల అప్పలనాయుడు, రుతాల కన్నబాబు.

విశిష్ట సేవా పతకాలు: 11 మంది అధికారులకు లభించాయి.

తెలంగాణ: 15 మందికి కేంద్ర పతకాలు

తెలంగాణ పోలీసు శాఖ నుంచి 15 మంది అధికారులను కేంద్ర హోంశాఖ పురస్కారాలకు ఎంపిక చేసింది.

రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు (2):

జోగుల నర్సయ్య (అదనపు డిప్యూటీ కమిషనర్)

ఆర్‌. జగదీశ్వర్ రెడ్డి (ఎస్పీ)

గ్యాలంట్రీ మెడల్స్ (3): జూనియర్ కమాండోలు బి. సత్యరావు, కె. సందీప్ కుమార్, జె.వంశీకృష్ణ.

విశిష్ట సేవా పతకాలు: 10 మందికి లభించాయి.

21 మంది సీబీఐ అధికారులకు గుర్తింపు

కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)లో పనిచేస్తున్న 21 మంది అధికారులకు కూడా ఈ పతకాలు దక్కాయి. ఆరుగురు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 15 మందికి విశిష్ట సేవా పతకాలు లభించాయి. విశాఖపట్నం సీబీఐ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సంజయ్ కుమార్ సమాల్‌ కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం దక్కింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story