Parlakhemundi: పర్లాఖెముండిలో అక్రమ టేకు రవాణా భగ్నం పికప్ వాహనం స్వాధీనం!

Parlakhemundi: పర్లాఖెముండి సమీపంలో అక్రమ టేకు రవాణా భగ్నం.. రూ.లక్ష విలువైన 42 టేకు దుంగలు, పికప్ వాహనం స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు.

S.Anil, Gajapati Dst
Published on: 12 Sept 2026 9:41 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: పర్లాఖెముండిలో అక్రమ టేకు రవాణా భగ్నం పికప్ వాహనం స్వాధీనం!

Parlakhemundi: గజపతిజిల్లా మోహన బ్లాక్ చంద్రగిరి రేంజ్ ఫారెస్టు అధికారులు గురువారం రాత్రి పెట్రోలింగ్ జరుపుతుండగా దడిఅంబో చంద్రగిరి రోడ్డు జగన్నాథపురం వద్ద ఒడిశా రిజిస్ట్రేషన్ కలిగిన మహీంద్ర మ్యాక్సీ పికప న్ను తనిఖీ చేయగా అం దులో 42 సైజు కటింగ్ టేకు ముక్కలు కనిపించాయి.

వాటిని తూకం వేయగా మొత్తం 15.88 చద రపు అడుగులు ఉన్నట్టు ఫారెస్టు అధికారులు నిర్ధా రించారు. వీటి విలువ లక్ష రూపాయలకుపైగా వుం టుందని అంచనా. ఒడిశా అటవీ చట్టప్రకారం కేసును చంద్రగిరి రేంజ్ అధికారులు ఫైల్ చేశారు. అయితే నిందితుడు అటవీశాఖ అధికారులను చూసి పారిపోయినట్టు డివిజనల్ ఫారెస్టు అధికారి కె.నా గరాజు తెలిపారు. తప్పించుకున్న నిందితుడిని పట్టు కోవడానికి గాలింపు చర్యలు చేపడుతున్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst