Ankit Balyan: సింగర్ అంకిత్ బాల్యన్ హత్య కేసులో సంచలన నిజాలు.. పాటనే ప్రాణం తీసిందా?

Ankit Balyan: హరియాణా సింగర్ అంకిత్ బాల్యన్ హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Arun Chilukuri
Published on: 1 Sept 2026 10:43 AM IST
Ankit Balyan
X

Ankit Balyan: సింగర్ అంకిత్ బాల్యన్ హత్య కేసులో సంచలన నిజాలు.. పాటనే ప్రాణం తీసిందా?

Ankit Balyan: హరియాణాకు చెందిన యువ సింగర్, నటుడు అంకిత్ బాల్యన్ హత్య వెనక గ్యాంగ్‌స్టర్ల కక్షలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అతడు నటించిన ఓ పాటనే అతని ప్రాణాలు తీసిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆగస్టు 26న ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఓ జిమ్ బయట అంకిత్ బాల్యన్‌ను దుండగులు కాల్చి చంపారు.

'భరీ కోర్ట్ మే గోలీ మారేంగే..' అనే పాటలో నటించడం, అది యూట్యూబ్‌లో 54 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించడమే ఈ హత్యకు ప్రధాన కారణం. ఈ పాటలోని సాహిత్యం తమ గ్యాంగ్ లీడర్ జితేందర్ గోగిని (2021లో హత్యకు గురయ్యాడు) అవమానించేలా ఉందని 'గోగి గ్యాంగ్' భావించింది.

అంకిత్, ప్రత్యర్థి గ్యాంగ్ లీడర్ టిల్లు తాజ్‌పురియా ఒకే సామాజిక వర్గానికి చెందినవార కావడంతో, ప్రత్యర్థికి మద్దతుగా ఈ పాట చేశాడని గ్యాంగ్ కక్ష పెంచుకుంది. ఆగస్టు 31న యూపీ పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఈ హత్యకు పాల్పడిన నిందితులు సుమిత్, మోహిత్ మృతి చెందారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story