Trisha: విజయ్‌తో రూమర్ల ఎఫెక్ట్.. త్రిష సంచలన పోస్ట్!

Trisha: దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష తనపై వస్తున్న విమర్శలకు మౌనమే సమాధానమని స్పష్టం చేశారు.

Naresh.k
Published on: 6 April 2026 9:51 AM IST
Trisha
X

Trisha: విజయ్‌తో రూమర్ల ఎఫెక్ట్.. త్రిష సంచలన పోస్ట్!

Vijay: దక్షిణాది వెండితెరపై రెండు దశాబ్దాలుగా క్వీన్‌లా వెలిగిపోతున్న అందాల తార త్రిష కృష్ణన్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఈ మధ్య కాలంలో ఆమె వ్యక్తిగత జీవితం చుట్టూ అల్లుకున్న వివాదాలు తమిళనాట పెను దుమారాన్నే రేపుతున్నాయి. ముఖ్యంగా దళపతి విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత త్రిష పేరును కావాలనే వివాదాల్లోకి లాగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తనపై వస్తున్న ఆరోపణలకు త్రిష తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. గత కొన్నాళ్లుగా త్రిషపై వస్తున్న రాజకీయ, వ్యక్తిగత విమర్శలు హద్దులు దాటుతున్నాయి. విజయ్ రాజకీయ పార్టీ టీవీకే ప్రస్థానం మొదలైనప్పటి నుండి, ప్రత్యర్థి వర్గాలు ఆమెను టార్గెట్ చేస్తూ రకరకాల రూమర్స్ సృష్టిస్తున్నాయి. అయితే, వీటన్నింటికీ త్రిష నేరుగా స్పందించకుండా, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తన మనోభావాలను పంచుకున్నారు.

ఏనుగు ఎగురుతుందన్నా..

త్రిష తన తాజా పోస్ట్‌లో ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు. నేను ఇప్పుడు ఎవరితోనూ వాదించే స్థితిలో లేను. ఒకవేళ ఎవరైనా వచ్చి ఏనుగు ఆకాశంలో ఎగురుతోంది అని చెబితే.. అవును నువ్వు చెప్పింది నిజమే అని ఒప్పేసుకుంటాను. మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నా శక్తిని వృధా చేసుకోను. ఎందుకంటే నాకు సరిగ్గా ఉండటం కంటే శాంతంగా ఉండటమే ముఖ్యం అంటూ ఒక వీడియోను షేర్ చేశారు. అనవసరమైన వాదనల వల్ల కలిగే నీరసం కంటే, చిరునవ్వుతో మౌనంగా ఉండటమే మేలని ఆమె నెటిజన్లకు సందేశమిచ్చారు.

జీవితం గురించి త్రిష ఫిలాసఫీ

మరో వీడియోలో ఆమె తన జీవన శైలిని వివరిస్తూ.. ఇతరుల అభిప్రాయాలను మనం మార్చలేం. మనం చేయగలిగిందల్లా మన జీవితాన్ని మనం ఉత్తమంగా జీవించడమే. నిజాయితీగా ఉండండి, స్పష్టంగా మాట్లాడండి. అప్పుడు రాత్రి పూట హాయిగా నిద్రపోవచ్చు అని పేర్కొన్నారు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, తన వ్యక్తిత్వాన్ని వదులుకోనని ఆమె పరోక్షంగా స్పష్టం చేశారు.

ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు

పెళ్లి, సంబంధాలపై వస్తున్న రూమర్ల నడుమ.. త్రిష ప్రేమ గురించి చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. ప్రేమే సర్వస్వం కాదు.. కానీ ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు అనే కొటేషన్‌ను షేర్ చేస్తూ.. అది నిజం అని క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు ఆమె తన మనసులోని మాటను బయటపెట్టిందని చర్చించుకుంటున్నారు.

సినిమాలతో ఫుల్ బిజీ

వివాదాలు ఒకవైపు ఉన్నా, కెరీర్ పరంగా త్రిష దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. సూర్య సరసన నటిస్తున్న కరుప్పు సినిమా మే 14న విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి త్రిష నటిస్తున్న చిత్రం విశ్వంభర. సోషియో ఫాంటసీ మూవీ ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి చేసిన ఓ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమిళనాడులో ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ సినీ ప్రముఖులపై విమర్శలు రావడం సహజం. అయితే 42 ఏళ్ల వయసులోనూ తన గ్రేస్‌ను కాపాడుకుంటూ, వివాదాలను మౌనంతో జయిస్తున్న త్రిష తీరు ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. సింహం మౌనంగా ఉందంటే భయపడిందని కాదు.. తన సమయం కోసం ఎదురుచూస్తుందని అర్థం అంటూ ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు.

Naresh.k

Naresh.k

Next Story