Rebati Tripura: పార్లమెంట్ నుంచి పాఠశాలకు.. మళ్లీ చాక్‌పీస్ పట్టిన మాజీ ఎంపీ రేబతి త్రిపుర!

Rebati Tripura: బీజేపీ మాజీ ఎంపీ రేబతి త్రిపుర తిరిగి ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు.

Arun Chilukuri
Published on: 3 Aug 2026 10:40 AM IST
Rebati Tripura
X

Rebati Tripura: పార్లమెంట్ నుంచి పాఠశాలకు.. మళ్లీ చాక్‌పీస్ పట్టిన మాజీ ఎంపీ రేబతి త్రిపుర!

Rebati Tripura: రాజకీయాల్లో ఎంపీగా పార్లమెంటులో గళం విప్పిన ఒక నేత, పదవి ముగిశాక తిరిగి తన పాత వృత్తిలోకి వెళ్లడం అరుదుగా చూస్తుంటాం. త్రిపురలో అలాంటి ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ మాజీ ఎంపీ రేబతి త్రిపుర ప్రజాప్రతినిధి హోదాను వీడి మళ్లీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు.

గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన రేబతి త్రిపుర, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా త్రిపుర ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2019 నుంచి 2024 వరకు పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం ఆయనకు తిరిగి పోటీ చేసేందుకు టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చి, తిరిగి తన పాత వృత్తి అయిన బోధన రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

నిబంధనల ప్రకారం ఆయన విధుల్లోకి చేరేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, త్రిపుర విద్యాశాఖ దాన్ని పరిశీలించి ఆయనను తిరిగి టీచర్‌గా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన మళ్లీ బడిబాట పట్టి చాక్‌పీస్ చేతబట్టి విద్యార్థులకు బోధన అందిస్తున్నారు. ఒక మాజీ ఎంపీ బడిపంతులుగా తిరిగి బాధ్యతలు స్వీకరించడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story