Earthquake: మూడు రాష్ట్రాల్లో భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు

Earthquake: మధ్యప్రదేశ్, హర్యానా, సిక్కిం రాష్ట్రాల్లో ఉదయం నుంచి వరుసగా భూకంపాలు సంభవించాయి. స్వల్ప ప్రకంపనలు అయినప్పటికీ ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.

KVD Varma
Published on: 29 March 2026 4:50 PM IST
Earthquake: మధ్యప్రదేశ్, హర్యానా, సిక్కిం రాష్ట్రాల్లో ఉదయం నుంచి వరుసగా భూకంపాలు సంభవించాయి
X

Earthquake

Earthquake: మూడు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు ఆందోళన రేకెత్తించాయి. మధ్యప్రదేశ్, హర్యానా, సిక్కిం రాష్ట్రాల్లో వరుస భూకంపాలు సంభవించాయి. దీంతో ఈ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతాలలో ఇటీవల పదేపదే సంభవిస్తున్న భూకంపాల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

మధ్యప్రదేశ్ లో..

ఈరోజు తెల్లవారుజామున 3.57 గంటలకు మధ్యప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 2.9 తీవ్రతతో నమోదైంది. తీవ్రత తక్కువ కావడంతో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించేలేదు.

హర్యానాలో రెండుసార్లు..

మధ్యప్రదేశ్‌లో భూకంపం తర్వాత, ఉదయం 6.47 గంటలకు హర్యానాలో మరో భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 2.5 తీవ్రతతో నమోదైంది. కొద్దిసేపటి తరువాత అక్కడ మరో భూకంపం సంభవించింది. సరిగ్గా ఉదయం 6.53 గంటలకు సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 2.5గా నమోదైంది.


సిక్కింలో..

మధ్యప్రదేశ్, హర్యానాల తర్వాత సిక్కింలో కూడా భూకంపం సంభవించింది. అక్కడ సరిగ్గా ఉదయం 10.54 గంటలకు సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. మధ్యప్రదేశ్, తీవ్రతతో ఇక్కడ భూమి కంపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు.


మనదేశంలో భూకంపాలు అప్పుడప్పుడు వస్తుండడం సహజం. అయితే, ఈరోజు మధ్యప్రదేశ్, హర్యానా, సిక్కింలలో ఒకే రోజున వరుసగా భూకంపాలు సంభవించడం ఆ ప్రాంత ప్రజలలో తీవ్ర ఆందోళనను కలిగించింది. ఈ భూకమపాలకు సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story