DMK: కాంగ్రెస్‌తో డీఎంకే కట్.. ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చిన స్టాలిన్ పార్టీ!
DMK: తమిళనాడులో టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. ఇండీ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీల పక్కన కూర్చోలేమని కనిమొళి స్పీకర్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది.
DMK: కాంగ్రెస్‌తో డీఎంకే కట్.. ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చిన స్టాలిన్ పార్టీ!
DMK: దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండీ కూటమిలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే (DMK), కాంగ్రెస్‌తో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న పొత్తుకు స్వస్తి పలికింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న సమీకరణాల నేపథ్యంలో డీఎంకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తెలపడం డీఎంకేను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. కూటమిలో ఉంటూనే కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే ఎమ్మెల్యేలు మండిపడ్డారు. డీఎంకే పుణ్యమా అని రాజ్యసభ సీట్లు, అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, ఇప్పుడు ద్రోహానికి ఒడిగట్టిందని ఆక్షేపించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, లోక్‌సభలో తమకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్‌కు లేఖ రాశారు. కాంగ్రెస్ ఎంపీల పక్కన తాము కూర్చోలేమని ఆమె స్పష్టం చేయడం పొత్తుల తెగతెంపులకు పరాకాష్టగా నిలిచింది.
కాంగ్రెస్ తీరును కేవలం డీఎంకే మాత్రమే కాకుండా కూటమిలోని ఇతర నేతలు కూడా తప్పుబడుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. స్వలాభం కోసం కీలక మిత్రపక్షాలను వదులుకోవడం కూటమి భవిష్యత్తుకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని హితవు పలికారు.
కాంగ్రెస్ నిర్ణయంతో ఇకపై ఇండీ కూటమితో సంబంధం లేదని ప్రకటించిన డీఎంకే, తమిళనాడులో బలమైన ప్రతిపక్షంగా ఉంటూనే ప్రజా సమస్యలపై పోరాడుతామని వెల్లడించింది. కాంగ్రెస్ తన పాత అలవాటును మార్చుకోలేదని, మిత్రులను నట్టేట ముంచడంలో ఆ పార్టీకి సాటిలేదని డీఎంకే నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.




