Fire Accident: గంటపాటు నరకయాతన.. బస్సులోనే కాలి బూడిదైన ఏడుగురు ప్రయాణికులు!

Fire Accident: రాజస్థాన్ లోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం జరిగింది. దౌసా జిల్లాలో స్లీపర్ బస్సు - ట్రక్కు ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగి ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

Arun Chilukuri
Published on: 1 July 2026 10:52 AM IST
Fire Accident
X

Fire Accident: గంటపాటు నరకయాతన.. బస్సులోనే కాలి బూడిదైన ఏడుగురు ప్రయాణికులు!

Fire Accident: రాజస్థాన్‎లో ఘోరప్రమాదం జరిగింది. ఢిల్లీృ-ముంబై ఎక్స్‎ప్రెస్‎వేపై ట్రక్కు-బస్సు ఢీకొన్నాయి. మంటలు అంటుకుని ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దౌసా జిల్లా కొల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారాపుర దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్సు వేగంగా వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. వెంటనే రెండు వాహనాల్లో ఒక్క సారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే బస్సు-ట్రక్కు పూర్తిగా దగ్దం అయ్యాయి.

ప్రమాదం జరిగిన తర్వాత గంట పాటు బస్సులోనే చ్కుకుకుపోయిన వారు రక్షించాలంటూ కేకలు వేశారు. అప్పటికా ఘటనా స్థలానికి చేరుకున్న స్తానికులు బస్సు కిటికిలు, తలుపులు పగులగొట్టి లోపల చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకు వచ్చారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులోపల చిక్కుకున్న వారని బయటకు తీసుకు వచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే బస్సు మితిమీరిన వేగంతా వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రమాద కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎక్స్‎ప్రెస్‎వేపై అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులు గంటపాటు బస్సులోనే నరకయాతన పడటాన్ని చూసిన స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు కంట్రోల్ రూంకు సమాచారం అందించారు. అయినప్పటికీ అంబులెన్స్, ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడంలో ఆలస్యం చేశాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో మంటలు విపరీతంగా వ్యాపించాయని చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story