Supreme Court: మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్: జోక్యం తప్పదు!

Supreme Court: నిరసనల నేపథ్యంలో దిల్లీలో వరుసగా రెండోరోజు 16 మెట్రో స్టేషన్లు మూసివేశారు.

Arun Chilukuri
Published on: 23 July 2026 12:53 PM IST
Supreme Court
X

మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్: జోక్యం తప్పదు!

Supreme Court: కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు వరుసగా రెండో రోజు కూడా నగరంలోని 16 కీలక మెట్రో స్టేషన్లను మూసివేశారు. దీంతో సాధారణ ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మెట్రో స్టేషన్ల మూసివేత వల్ల న్యాయవాదులు, వ్యాజ్యదారులు మరియు కోర్టు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమయానికి న్యాయస్థానానికి చేరుకోలేకపోతున్నారని తెలుపుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ఈ అంశంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను కోరింది.

ఈ పిటిషన్‌పై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం వరకు వేచి చూద్దామని, ఆ తర్వాత కూడా రవాణా సమస్యలు పరిష్కారం కాకపోతే, సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేస్తుందని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story