CJP: కేంద్రానికి CJP హెచ్చరిక.. రేపటిలోగా కేసులు ఎత్తేయకపోతే తీవ్ర పరిణామాలు!
CJP: పేపర్ లీక్ ఆందోళనకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
CJP: కేంద్రానికి CJP హెచ్చరిక.. రేపటిలోగా కేసులు ఎత్తేయకపోతే తీవ్ర పరిణామాలు!
CJP: పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపిన విద్యార్థులు, ఆందోళనకారులపై నమోదైన కేసులను తక్షణమే ఎత్తివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమకు ఇచ్చిన మాటను కేంద్రం నిలబెట్టుకోవడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను (FIRs) ఉపసంహరించుకుంటామని కేంద్ర మంత్రులు స్పష్టమైన హామీ ఇచ్చారని, ఆ నమ్మకంతోనే తాము ఆందోళనలను తాత్కాలికంగా విరమించామని సౌరవ్ దాస్ గుర్తుచేశారు.
ఇప్పటివరకు కేసులు ఎత్తివేయకపోగా.. అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్ వంటి రాష్ట్రాల్లో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అరెస్టులు, కేసుల వ్యవహారంపై లీగల్ టీమ్‌తో చర్చిస్తున్నామని తెలిపిన ఆయన.. రేపటిలోగా దేశవ్యాప్తంగా నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని, నిర్బంధంలో ఉన్నవారిని తక్షణమే విడుదల చేయాలని స్పష్టమైన గడువు విధించారు.
ఇచ్చిన హామీ ప్రకారం ఈ సమస్యపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ తక్షణమే జోక్యం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
రేపటిలోగా కేసులు ఉపసంహరించుకోకపోతే విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని సౌరవ్ దాస్ కేంద్రానికి స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.




