Jantar Mantar Season 2: మరో పోరుకు సిద్ధమైన సీజేపీ.. ‘ప్రజల మాట విందాం యాత్ర’ ప్రకటన!

Jantar Mantar Season 2: జంతర్ మంతర్ సీజన్ 2 పోరాటానికి కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధమవుతోంది.

Arun Chilukuri
Published on: 13 Aug 2026 10:51 AM IST
Jantar Mantar Season 2
X

Jantar Mantar Season 2: మరో పోరుకు సిద్ధమైన సీజేపీ.. ‘ప్రజల మాట విందాం యాత్ర’ ప్రకటన!

Jantar Mantar Season 2: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద వరుసగా 36 రోజుల పాటు ఆందోళన చేపట్టి వార్తల్లో నిలిచిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) మరో భారీ నిరసనకు ముస్తాబవుతోంది. ఈసారి విద్యా రంగానికి సంబంధించిన అంశాలతో పాటు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తూ దేశవ్యాప్తంగా ‘ప్రజల మాట విందాం యాత్ర’ను చేపట్టబోతున్నట్లు ప్రకటించింది. ఈ నూతన ఆందోళన కార్యక్రమాన్ని ‘జంతర్‌ మంతర్‌ సీజన్‌ 2’గా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే వర్ణించారు.

యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై సోషల్‌ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోందని, త్వరలోనే స్పష్టమైన తేదీని వెల్లడించి 'సీజన్ 2' ప్రారంభించబోతున్నామని దీప్కే స్పష్టం చేశారు. ఢిల్లీలోని నారాయణ ప్రాంతంలో బుధవారం తలపెట్టిన సీజేపీ వాలంటీర్ల సమావేశం ఆకస్మికంగా రద్దయిన అనంతరం ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. అధికార బీజేపీ తీవ్ర ఒత్తిడి తీసుకురావడం వల్లే తాము బుక్ చేసుకున్న సమావేశ మందిరం యాజమాన్యం చివరి నిమిషంలో బుకింగ్‌ను రద్దు చేసిందని ఆయన ఆరోపించారు.

మరోవైపు సీజేపీతో అనుసంధానమైన వ్యక్తుల కార్యకలాపాలు, నకిలీ న్యాయవాదులు, బూటకపు లా డిగ్రీల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది రాజా చౌధరీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ అంశంపై పూర్తిస్థాయి స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐ, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ)లను అత్యున్నత నాయస్థానం ఆదేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story