Maoists: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. రూ. 3.29 కోట్ల రివార్డు ఉన్న 108 మంది లొంగుబాటు

Maoists: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతలో పోలీసులు మరో భారీ విజయాన్ని అందుకున్నారు.

Arun Chilukuri
Published on: 11 March 2026 4:29 PM IST
Maoists: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. రూ. 3.29 కోట్ల రివార్డు ఉన్న 108 మంది లొంగుబాటు
X

Maoists: మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ.. రూ. 3.29 కోట్ల రివార్డు ఉన్న 108 మంది లొంగుబాటు

Maoists: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతలో పోలీసులు మరో భారీ విజయాన్ని అందుకున్నారు. జగదల్‌పుర్ పరిధిలో ఏకంగా 108 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వీరందరూ తమ వద్ద ఉన్న ఆయుధాలను అధికారులకు అప్పగించారు.

లొంగిపోయిన మావోయిస్టులపై ప్రభుత్వం మొత్తం రూ.3.29 కోట్ల రివార్డు ప్రకటించి ఉంది. విశేషమేమిటంటే, లొంగిపోయిన వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. వీరి నుంచి 101 వివిధ రకాల ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

లొంగుబాటు అనంతరం మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు భారీ డంపును కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో లభించిన సొత్తు వివరాలు చూసి అధికారులు సైతం అశ్చర్యపోయారు:

నగదు: రూ.3.61 కోట్ల నగదు.

బంగారం: రూ.1.64 కోట్ల విలువైన ఒక కిలో బంగారం.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకం మావోయిస్టులను ఆకర్షిస్తోంది. గత 26 నెలల్లోనే ఛత్తీస్‌గఢ్‌ వ్యాప్తంగా మొత్తం 2,714 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. హింసా మార్గాన్ని వీడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story