కేంద్రం సంచలన నిర్ణయం.. ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం (NSA) అమలు!

ఢిల్లీలో సీజేపీ (CJP) నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 23 July 2026 2:53 PM IST
delhi
X

కేంద్రం సంచలన నిర్ణయం.. ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం (NSA) అమలు!

దేశ రాజధాని ఢిల్లీలో కాకరోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన మరియు సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం (National Security Act - NSA) అమలు చేయాలని నిర్ణయిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు కేంద్రం విశేష అధికారాలను కల్పించింది. జాతీయ భద్రత, శాంతిభద్రతల దృష్ట్యా సందేహాస్పద వ్యక్తులను లేదా నిరసనకారులను ముందస్తు నిరోధాత్మక చర్యల్లో భాగంగా (Preventive Detention) ఎటువంటి విచారణ లేకుండానే ఏడాది పాటు నిర్బంధించే (అరెస్ట్ చేసే) అధికారం పోలీసులకు లభించింది.

హోం శాఖ జారీ చేసిన ఈ ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ రాబోయే మూడు నెలల కాలానికి అమల్లో ఉంటుంది. పెరిగిపోతున్న సీజేపీ ఆందోళనలు, లా అండ్ ఆర్డర్ సమస్యల నేపథ్యంలో రాజధానిలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకే కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story