BJP: బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం.. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం..
BJP: దేశంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, త్రిపుర రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
BJP: బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం.. నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం..
BJP: దేశవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, సంస్థాగత మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (BJP) అధిష్టానం గురువారం కీలక నియామకాలను ప్రకటించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, త్రిపుర రాష్ట్రాల పార్టీ విభాగాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాబోయే ఎన్నికలు, పార్టీ అంతర్గత బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
ఎవరికి ఏ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారంటే?
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ పగ్గాలను కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రాకు అప్పగించారు.
పంజాబ్: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీనియర్ నేత సర్దార్ కేవల్ సింగ్ ధిల్లాన్‌ను అధ్యక్షుడిగా నియమించారు.
హర్యానా: మహిళా నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ డా. అర్చన గుప్తాకు హర్యానా బీజేపీ బాధ్యతలు కట్టబెట్టారు.
త్రిపుర: మాతాబరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభిషేక్ దేబ్రాయ్‌ను త్రిపుర రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎంపిక చేశారు.
ఈ కొత్త నియామకాల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం వస్తుందని, రాష్ట్ర కమిటీల పనితీరుకు మరింత వేగం చేకూరుతుందని బీజేపీ జాతీయ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.




