Parlakhemundi: పర్లాఖెముండిలో బ్యాంకు ఉద్యోగుల నిరసన ప్రదర్శన!
Parlakhemundi: వారానికి 5 రోజులు పనిదినాలు కల్పించాలని గజపతి జిల్లా పర్లాఖెముండిలో బ్యాంకు ఉద్యోగుల నిరసన డిమాండ్లు తీర్చకుంటే సమ్మె చేస్తామని హెచ్చరిక.
Parlakhemundi: పర్లాఖెముండిలో బ్యాంకు ఉద్యోగుల నిరసన ప్రదర్శన!
Parlakhemundi: వారానికి ఐదు రోజులు పాటు పని దినాలు విధానాన్ని వెంటనే అమలు చేయాలంటూ గజపతి జిల్లాలోని బ్యాంకు సిబ్బంది శుక్రవారం కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టారు.
పర్లాఖెముండి పట్టణంలోని ఎస్బీఐ కార్యాలయం ఎదుట యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్ బీయూ) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు ఆదివారం తో పాటు ప్రతి నెల రెండు, ఆఖరి శనివారాలు సెలవులు అయితే ఒకటి మూడు శనివారాలను కూడా ఇందులో కలపాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.
తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఈ నెల 28,29,30 తేదీల్లో ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.




