Assembly Election Results: ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్ని సీట్లు రావాలి.? ఏ రాష్ట్రాల్లో మ్యాజిక్ ఫిగర్ ఎంత.?
Assembly Election Results: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, అలాగే పుదుచ్చేరి ప్రాంతాల్లో అధికార పోరు ఉత్కంఠ రేపుతోంది.
Assembly Election Results
Assembly Election Results: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, అలాగే పుదుచ్చేరి ప్రాంతాల్లో అధికార పోరు ఉత్కంఠ రేపుతోంది. కొన్ని చోట్ల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది?
తాజా ట్రెండ్స్‌ను పరిశీలిస్తే రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. విజయ్ నాయకత్వంలోని TVK పార్టీ తమిళనాడులో ఊహించని స్థాయిలో ముందంజలో ఉంది. డీఎంకే, అన్నాడీఎంకేలకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం 113 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ అధికార పోరులో దూసుకుపోతోంది. కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అస్సాం లో బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది. కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ రాష్ట్రంలో ఎంత మ్యాజిక్ ఫిగర్ రావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడులో అధికారానికి అవసరమైన మ్యాజిక్ నెంబర్
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 118 స్థానాలు అవసరం. ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తే గట్టి పోటీ కొనసాగుతోంది. ఒక పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందా లేదా కూటమి అవసరమవుతుందా అన్నది కీలకం.
పశ్చిమ బెంగాల్: గెలుపు కోసం కీలక సంఖ్య
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉన్నప్పటికీ, ఒక నియోజకవర్గంలో రీపోలింగ్ కారణంగా ప్రస్తుతం 293 స్థానాలకే కౌంటింగ్ జరుగుతోంది. ఇక్కడ అధికారానికి 148 స్థానాలు అవసరం. ఈ రాష్ట్రంలో పోరు హోరాహోరీగా మారింది.
అస్సాం, కేరళ: మెజారిటీ సమీకరణం
అస్సాంలో మొత్తం 126 స్థానాలు ఉండగా, అధికారానికి 64 స్థానాలు కావాలి. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం ఒకే పార్టీ మెజారిటీ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళలో మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 71 స్థానాలు అవసరం. ప్రస్తుతం కూటముల మధ్య పోటీ స్పష్టంగా కనిపిస్తోంది.
పుదుచ్చేరి: చిన్న రాష్ట్రం.. పెద్ద పోరు
పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. అధికారానికి 16 స్థానాలు కీలకం. చిన్న రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ కూడా కూటముల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.




