Amarnath Pilgrims: ఇంటిపైకి దూసుకెళ్లిన బస్సు.. అమర్‌నాథ్ యాత్రికులకు తప్పిన పెద్ద ముప్పు!
Amarnath Pilgrims: జమ్మూకశ్మీర్‌లోని గాందర్‌బల్ జిల్లా కంగన్ సమీపంలో అమర్‌నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదం.
Amarnath Pilgrims: ఇంటిపైకి దూసుకెళ్లిన బస్సు.. అమర్‌నాథ్ యాత్రికులకు తప్పిన పెద్ద ముప్పు!
Amarnath Pilgrims: అమర్‌నాథ్ యాత్రను ముగించుకుని తిరిగి వస్తున్న ప్రయాణికుల బస్సు జమ్మూకశ్మీర్‌లో ప్రమాదానికి గురైంది. గాందర్‌బల్ జిల్లా కంగన్ ప్రాంతం సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 39 మంది యాత్రికులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
కంగన్ సమీపంలోని రహదారిపై ఉన్న ఒక మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న ఒక ఇంటిపైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. బస్సు రహదారి పక్కనే ఉన్న ఇంటిపై పడటం వల్లే సమీపంలోని సింధు నదిలోకి దొర్లకుండా ఆగిపోయిందని, లేకపోతే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. గాయపడిన యాత్రికులను స్థానికులు, సహాయక సిబ్బంది తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (LG) మనోజ్ సిన్హా ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయక చర్యలను సమీక్షించారు. గాయపడిన యాత్రికులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.




