Justice Yashwant Varma: నోట్ల కట్టల కేసు.. అలహాబాద్ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ రాజీనామా!

Justice Yashwant Varma: అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. ఢిల్లీ నివాసంలో నోట్ల కట్టలు దొరికిన ఘటనపై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ మొదలవనున్న తరుణంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 10 April 2026 1:06 PM IST
Justice Yashwant Varma
X

 Justice Yashwant Varma: నోట్ల కట్టల కేసు.. అలహాబాద్ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ రాజీనామా!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'నోట్ల కట్టల' వివాదంలో చిక్కుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. పార్లమెంటులో ఆయనపై అభిశంసన ప్రక్రియ (Impeachment) ప్రారంభం కానున్న తరుణంలో ఈ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.

అసలు ఏం జరిగింది?

గతంలో జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయన అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడ భారీగా కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

విచారణ మరియు చర్యలు:

అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ ఘటనపై ముగ్గురు హైకోర్టు జడ్జిలతో కూడిన కమిటీని వేశారు. నోట్ల కట్టలు దొరికిన మాట వాస్తవమేనని కమిటీ నిర్ధారించింది. సీజేఐ సూచించినప్పటికీ జస్టిస్ వర్మ రాజీనామాకు నిరాకరించారు. దీంతో ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడంతో పాటు, విధులకు దూరం పెట్టారు.

జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టు సీజేఐ రాష్ట్రపతికి, ప్రధానికి లేఖ రాయగా.. పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తాజా రాజీనామాతో ఆయనపై కొనసాగుతున్న అభిశంసన ప్రక్రియ ముగిసిపోయినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story