AIADMK: టీవీకే గెలుపుపై ఛాలెంజ్.. మీసాలు తీసేసుకున్న అన్నాడీఎంకే నాయకుడు

AIADMK: శాసనసభ ఎన్నికల్లో టీవీకే గెలుపుపై వేసిన సవాలు మేరకు నీలగిరి జిల్లా అన్నాడీఎంకే నాయకుడు బాలనందకుమార్‌ తన మీసాలు తీసేశారు.

Arun Chilukuri
Published on: 22 Aug 2026 10:37 AM IST
AIADMK: టీవీకే గెలుపుపై ఛాలెంజ్.. మీసాలు తీసేసుకున్న అన్నాడీఎంకే నాయకుడు
X

AIADMK: శాసనసభ ఎన్నికల నేపథ్యంతో ఇచ్చిన సవాలును నెరవేరుస్తూ నీలగిరి జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి, న్యాయవాది బాలనందకుమార్‌ తన మీసాలు తీసేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ 10 కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందితే తాను మీసాలు తీసేస్తానని గతంలో ఆయన సవాల్ విసిరారు. ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రావడంతో, ఆయన తన మాట ప్రకారమే మీసాలు తీసేసుకున్నారు.

ఈ విషయాన్ని బాలనందకుమార్‌ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాను విసిరిన సవాలుకు కట్టుబడి మీసాలు తీసేసినట్లు పేర్కొనడంతో ఈ వార్త స్థానికంగా మరియు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story