Prahar Guns: భారత సైన్యానికి ప్రహార్ మెషిన్ గన్లు.. వీటి స్పెషాలిటీ ఇదే!
Prahar Guns: గ్వాలియర్ ల్ని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పెస్ రెండు వేల ప్రహారి మెషిన్ గన్ లను భారత సైన్యానికి అందచేసింది.
Prahar Guns
Prahar Guns: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, భారత సైన్యానికి 2,000 'ప్రహార్' తేలికపాటి మెషిన్ గన్ల (LMG) మొదటి విడతను అందజేసింది. ఈ 7.62 mm క్యాలిబర్ ఆయుధాలను గ్వాలియర్‌లోని స్మాల్ ఆర్మ్స్ కాంప్లెక్స్‌లో తయారు చేశారు. బోర్డెన్ల వెంబడి భద్రతను, కాల్పుల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ఈ ఆయుధాలను ఉపయోగించుకుంటుంది. ప్రహార్ LMG 1,000 మీటర్ల వరకు పరిధిని కలిగి ఉంది. దీనివల్ల శత్రువులను దూరం నుంచే ఎదుర్కోవచ్చు. ఈ మెషిన్ గన్ల బరువు 8 కిలోగ్రాములు -వీటి బ్యారెల్ పొడవు 1,100 మిల్లీమీటర్లు. ఇవి నిమిషానికి 700 రౌండ్లు కాల్పులు జరుపుతాయి.
సైన్యానికి ఎల్ఎమ్జిని అప్పగించేందుకు శనివారం గ్వాలియర్ ప్లాంట్‌లో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రిత్వ శాఖ డీజీ ఎ. అంబరసు, కంపెనీ సీఈఓ ఆశిష్ రాజవంశీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మెషిన్ గన్ల మొదటి విడతను తీసుకువస్తున్న ట్రక్కులను అధికారులు జెండా ఊపి ప్రారంభించారు.
ఆరు సంవత్సరాల్లో..
ప్రాజెక్ట్ 6 సంవత్సరాలలో పూర్తయింది. నిర్ణీత సమయానికంటే ముందే డెలివరీ జరిగింది
బిడ్ సమర్పణ నుండి డెలివరీ వరకు ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి సుమారు ఆరు సంవత్సరాలు పట్టిందని కంపెనీ సీఈఓ ఆశిష్ రాజవంశీ తెలిపారు. కంపెనీ షెడ్యూల్ కంటే 11 నెలల ముందే మొదటి సరుకును డెలివరీ చేసింది. వాస్తవానికి ఈ మొత్తం ఆర్డర్ పూర్తి కావడానికి ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుందని అంచనా వేయగా, రాబోయే మూడు సంవత్సరాలలో దీనిని పూర్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది.
40,000 మెషిన్ గన్ల ఆర్డర్
కంపెనీ ప్రకారం, ఎల్ఎమ్జిల మొత్తం ఆర్డర్ సుమారు 40,000 యూనిట్లు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయగల సామర్థ్యాన్ని ఇది ప్రదర్శించిందని చెబుతూ, ముందస్తు డెలివరీని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఎ. అన్బరసు కంపెనీ సిబ్బందిని ప్రశంసించారు.
ప్రభుత్వ -ప్రైవేట్ రంగ భాగస్వామ్యం
ప్రభుత్వం రక్షణ పరిశ్రమ భాగస్వాములతో సన్నిహితంగా పనిచేస్తోందని అంబరసు అన్నారు. రక్షణ కొనుగోళ్లలో "వేగం", "స్థాయి" అనేవి రెండు కీలక స్తంభాలని ఆయన అభివర్ణించారు. దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేయాలని కూడా ఆయన అన్నారు.
ప్లాంట్ సామర్థ్యం -సాంకేతికత
గ్వాలియర్‌లో ఉన్న ఈ కేంద్రం సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది -ఏటా దాదాపు 100,000 ఆయుధాలను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ ఉపయోగించే సామగ్రిలో 90% కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారు అవుతాయి. ఇక్కడ అధికారులు తమ షూటింగ్‌ను ప్రాక్టీస్ చేసేందుకు ఒక భూగర్భ ఫైరింగ్ రేంజ్ కూడా ఉంది. కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్లాంట్‌కు ఏటా సుమారు 30 కోట్ల చిన్న క్యాలిబర్ మందుగుండు సామగ్రిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది, అలాగే పెద్ద -మధ్యస్థ క్యాలిబర్ మందుగుండు సామగ్రిని ఉత్పత్తి చేసేలా తన సామర్థ్యాన్ని విస్తరించే ప్లాన్ లో కంపెనీ యాజమాన్యం ఉంది.
కఠిన తనిఖీ..
ప్రతి ఆయుధాన్ని సైన్యంలోకి ప్రవేశపెట్టే ముందు, అది పూర్తిగా నమ్మదగినదని -విశ్వసనీయమైనదని నిర్ధారించుకోవడానికి బాలిస్టిక్ పరీక్షలు, పర్యావరణ తనిఖీలు -ఇతర సాంకేతిక పరీక్షలతో సహా అనేక పరీక్షలకు గురిచేస్తారని కంపెనీ వివరించింది.
భవిష్యత్తులో CQB ఆయుధాలు కూడా..
భవిష్యత్ ప్రణాళికలలో భాగంగా, ఈ కేంద్రం సమీప పోరాట (CQB) ఆయుధాలను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది దేశం చిన్న ఆయుధాల తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. ఏప్రిల్ 2026 నాటికి నెలకు సుమారు 1,000 LMGలను ఉత్పత్తి చేయడం ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొత్తం ఆర్డర్ మూడు సంవత్సరాల లోపే పూర్తి చేస్తారు.




