Nalgonda: వైఎస్సార్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం డీసీసీ అధ్యక్షుడు కైలాష్
Nalgonda: నల్గొండలో వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలు. వైఎస్సార్ పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన DCC అధ్యక్షుడు కైలాష్.
Nalgonda: వైఎస్సార్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం డీసీసీ అధ్యక్షుడు కైలాష్
Nalgonda: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుడు పున్న కైలాష్ నేత కొనియాడారు. వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం వద్ద మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్ సేవల వంటి విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నిరుపేదల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.
Next Story




