Yadadri: ప్రధాని మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి ప్రభుత్వ విప్ అయిలయ్య
Yadadri: జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ దారుణం. ఆలేరులో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో నిరసన. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్.
Yadadri: ప్రధాని మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి ప్రభుత్వ విప్ అయిలయ్య
యాదాద్రి: జంతర్ మంతర్ వద్ద ప్రశ్నాపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని,ప్రధాని నరేంద్ర మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడు,ప్రభుత్వ విప్,బీర్ల అయిలయ్య డిమాండ్ చేశారు.
ఆలేరు పట్టణ కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,బీజేపీ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీలు నిత్యకృత్యంగా మారాయని, దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని విమర్శించారు.
నీట్ సహా పలు పరీక్షల లీకేజీలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ,లీకేజీలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.




