Suryapet: వరకట్న వేధింపుల కేసులో ఎస్సై పక్షపాతం.. ఎస్పీకి ఫిర్యాదు
Suryapet: సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల ఎస్సై గోపికృష్ణపై బాధితురాలు బానోత్ అంజలి తీవ్ర ఆరోపణలు చేశారు.
Suryapet: వరకట్న వేధింపుల కేసులో ఎస్సై పక్షపాతం.. ఎస్పీకి ఫిర్యాదు
సూర్యాపేట: పెన్ పహాడ్ మండల ఎస్సై గోపికృష్ణ పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు బానోత్ అంజలి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెన్ పహాడ్. మండలం మోర్సకుంట తండాకు చెందిన నన్ను మా నాన్న చిలుకూరు మండలం కొమ్ము బండ తండ కు చెందిన బానోత్ పెద్దలు రెండవ కుమారుడు బానోత్ జగన్ (అస్సాం రైఫిల్) కు గత మూడు సంవత్సరాల క్రితం పెళ్లి చేసినారు. గత నాలుగు నెలల క్రితం నుంచి నా భర్త, ఆడపరచు శ్రీదేవి అత్తమామలు కలిసి అదనపు కట్నం కోసం నన్ను కొట్టినారు.
అప్పుడు నేను మూడు నెలల గర్భవతిని వాళ్లు కొట్టడం వల్ల నా గర్భం పోయింది ఇదే విషయంపై పెన్ పహాడ్ మండల ఎస్సై గోపి కృష్ణకు గర్భం పోయిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే నన్ను ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడుతూ.... తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి నేను ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు చేయకుండా తన ఆడపడుచుతో ఎస్సై గోపికృష్ణ తరచూ ఫోన్ మాట్లాడతాడని అందుకే నేను ఇచ్చిన కంప్లైంట్ పై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ భయభ్రాంతులను గురి చేస్తున్నారని ఈ విషయంపై జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. ఎస్సై గోపికృష్ణ ,తన భర్త కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.




