Nalgonda: ఓటర్లకు హియరింగ్ పత్రాలపై ముందే స్పష్టత ఇవ్వాలి: శ్రీదేవసేన!
Nalgonda: ఓటరు జాబితా సవరణ హియరింగ్‌కు రావాల్సిన పత్రాలపై ఓటర్లకు ముందే సమాచారం ఇవ్వాలని ఎన్నికల పరిశీలకురాలు శ్రీదేవసేన కేతేపల్లి మండలం కొర్లపాడులో అధికారులను ఆదేశించారు.
Nalgonda: ఓటర్లకు హియరింగ్ పత్రాలపై ముందే స్పష్టత ఇవ్వాలి: శ్రీదేవసేన!
నల్గొండ: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు హియరింగ్‌కు ఏయే ధ్రువపత్రాలు తీసుకరావాలో ముందే తెలియజేయాలని జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ ఏ. శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 287, 288 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ బి. చంద్రశేఖర్‌తో కలిసి ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా బిఎల్ఓలు, బిఎల్ఏలతో మాట్లాడి ఓటర్ల వివరాలు, నోటీసుల జారీ, హియరింగ్ పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ఓటరుకు నోటీసు ఎందుకు వెళ్లింది, దానికి సంబంధించిన ఆధారాలేమిటో ముందే సమాచారం ఇస్తే హియరింగ్ సులభంగా ముగుస్తుందన్నారు. ఈ విషయంలో సర్పంచ్‌లు, బిఎల్ఏలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.




