Tipparthi: నల్లగొండ జిల్లా తిప్పర్తిలో భక్తిశ్రద్ధలతో 'కప్పతల్లి' ఊరేగింపు
Tipparthi: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారంలో వర్షాలు కురవాలని కోరుకుంటూ గ్రామస్తులు, మహిళలు సంప్రదాయ ‘కప్పతల్లి’ ఆట ఆడి వరుణ దేవుడిని ప్రార్థించారు.
Tipparthi: నల్లగొండ జిల్లా తిప్పర్తిలో భక్తిశ్రద్ధలతో కప్పతల్లి ఊరేగింపు
నల్లగొండ జిల్లా: తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గ్రామస్తులు, మహిళలు, చిన్నారులు సాంప్రదాయ ‘కప్పతల్లి’ (తప్పకాముడు) ఆట ఆడారు.
వానలు లేక పంటలు ఎండిపోతున్న తరుణంలో, వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు చిన్నారులపై కావడి పెట్టి, దానికి కప్పను కట్టి వీధుల గుండా ఊరేగించారు. ప్రతి ఇంటి ముందు మహిళలు ఆ కప్పపై నీళ్ళు పోస్తూ వాన దేవుడిని ప్రార్థించారు. గ్రామీణ సంప్రదాయాలు, నమ్మకాలకు ప్రతీకగా సాగిన ఈ వేడుకలో గ్రామస్తులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.
Next Story




