Kambalapally: వర్షాల కోసం మహబూబాబాద్‌లో 'వరదపాశం' వింత ఆచారం!
Kambalapally: మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ గ్రామస్తులు పూర్వీకుల ఆచారమైన 'వరదపాశం' కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Kambalapally: వర్షాల కోసం మహబూబాబాద్‌లో 'వరదపాశం' వింత ఆచారం!
Kambalapally: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక కరువు ఛాయలు అలుముకోవడంతోరైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణ దేవుడు కరుణించి విస్తారంగా వర్షాలు కురిపించాలని, పాడి పంటలు సమృద్ధిగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా వరద పాశం కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు.కంబాలపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్ స్వామికి 21 రోజుల పాటు భజన కార్యక్రమాలు నిర్వహించిన గ్రామస్తులు.
అనంతరం తమ పూర్వీకుల ఆచారమైన వరదపాశం కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామస్తులు జాగిలాల వలె నటిస్తూ అరుస్తూ, మోకాళ్లపై వంగి బండరాయిపై పోసిన వరదపాశం ప్రసాదాన్ని స్వీకరించారు. వేడి వేడి పొగలు కక్కుతున్నప్పటికీ లెక్కచేయకుండా భక్తిశ్రద్ధలతో ఈ ఆచారాన్ని కొనసాగించారు.వర్షాలు కురవని సమయంలో తమ పూర్వీకులు వరదపాశం నిర్వహించడంతో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండేవని గ్రామస్తులు చెబుతున్నారు.
అందుకే పూర్వీకుల ఆచారాన్ని కొనసాగిస్తూ... ఈ ఏడాది కూడా వరుణ దేవుడు కరుణించి విస్తారంగా వర్షాలు కురిపించాలని కోరుకున్నామని తెలిపారు.మా పూర్వీకుల కాలం నుంచి వర్షాలు సరిగా కురవనప్పుడు ఈ వరదపాశం ఆచారం నిర్వహిస్తారని,వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ మేము కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
వరుణ దేవుడు కరుణించి విస్తారంగా వర్షాలు కురిపించాలని, రైతులకు మంచి పంటలు పండి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆచారాన్ని నిర్వహించాం. మా పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం.”వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ కంబాలపల్లి గ్రామస్తులు నిర్వహించిన ఈ సంప్రదాయ కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




