Nakrekal: వైద్య విధాన పరిషత్‌కు రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలి
Nakrekal: నల్గొండ జిల్లా నకిరేకల్ ఏరియా ఆసుపత్రిలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ సిబ్బంది 'మొక్కలు నాటుదాం.. మనవి చేద్దాం' పేరిట వినూత్న నిరసన తెలిపారు.
Nakrekal: వైద్య విధాన పరిషత్‌కు రెగ్యులర్ కమిషనర్‌ను నియమించాలి
Nakrekal: నకిరేకల్ నియోజకవర్గంలో రెండు నెలలుగా మా సమస్యలను వినిపించేందుకు అవకాశం లేదు.ఆత్మగౌరవంతో ఆ సమస్యల్ని పరిష్కరించుకునేందుకు ఆస్కారం లేదు". వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల ఆవేదన ఇది.దాదాపు 185 వివిధ స్థాయిల హాస్పిటల్స్ తో 4000 మంది సిబ్బందితో ప్రభుత్వ వైద్య సేవలలో అతి కీలకమైన పాత్ర పోషిస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మారబోతున్న వైద్య విధాన పరిషత్ కు,
మా శాఖ కమిషనర్ పదవీ విరమణ చేసి రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకూ రెగ్యులర్ కమిషనర్ ను నియమించక పోవడంతో ఆయా వైద్య శాలల పనితీరుపై సరైన పర్యవేక్షణ కొరవడడం తో పాటు వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, మినిస్టీరియల్ సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పేరుకుపోయిన తమ వ్యక్తిగత,సర్వీస్ పరమైన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయమై ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ స్పందించక పోవడంతో వైద్య విధాన పరిషత్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ లో " మొక్కలు నాటుదాం..మనవి చేద్దాం" అంటూ ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాం.( Plant a tree...Make a request).
పర్యావరణ పరిరక్షణ కు మొక్కలు,మా సమస్యల పరిష్కారానికి కమిషనర్ నియామకం అవసరం. అంటూ ఈ రోజు ప్రాంతీయ వైద్యశాల, నక్రేకల్లో, జిల్లా నల్గొండలో వైద్యులు , సిబ్బంది అందరూ కలిసి మొక్కలు నాటాము. ఇకనైనా మా ఆవేదన అర్ధం చేసుకుని వెంటనే రెగ్యులర్ కమిషనర్ ను నియమించాలని కోరుతున్నాం.
అత్యవసర వైద్య సేవలు అందించే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నందున వీధుల్లోకొచ్చి ఉద్యమాలు చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించలేక ఇటువంటి సున్నితమైన చర్యల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామం,అనివార్యమైన పరిస్థితిలో మేము ఉద్యమాలు తీవ్రతరం చేయక ముందే ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో ఐ. అమృత రావు, డా. ఎన్ ఇందిర,డా. మమత, డా. స్వాతి, పి. బాబురావు, ఉమామహేశ్వరి, పద్మావతి, ధనమ్మ, నరేందర్, కవిత విజయలక్ష్మి, సరిత, మంజుల, సునీత, స్వప్న, జ్యోతి, శ్రీవిద్య ,శ్రీకాంత్ తుదితరులు పాల్గొన్నారు.




