Munugode: గాలిదుమారంతో కూడిన పిడుగుపాటు.. తడిసిముద్దయిన వరిధాన్యం

Munugode: మునుగోడు మండలంలోని సొల్లేడు గ్రామంలో భారీ వర్షంతో తడిసిన వరిధాన్యం. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 27 May 2026 8:07 AM IST
Munugode
X

Munugode: గాలిదుమారంతో కూడిన పిడుగుపాటు.. తడిసిముద్దయిన వరిధాన్యం

Munugode: మునుగోడు మండల పరిధిలోని సొల్లేడు (వంగూరు గూడెం) గ్రామంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తీవ్రమైన గాలిదుమారంతో కూడిన భారీ పిడుగుపాటు పడటంతో స్థానిక రైతాంగం ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. ఈ అకాల వర్షం కారణంగా ఐకేపీ కేంద్రాలు, కల్లాలలో ఆరబోసిన వరిధాన్యం పూర్తిగా తడిసిముద్దయింది.

​రైతుల ఆవేదన: "నెలల తరబడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట, చేతికొచ్చే సమయానికి ఇలా వర్షార్పణం కావడం కోలుకోలేని దెబ్బ" అని పలువురు రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యానికి రంగు మారే ప్రమాదం ఉన్నందున, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం మద్దతు ధరతో తడిసిన వరిని తక్షణమే కొనుగోలు చేసి, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story