Nalgonda: నల్గొండలో అనధికారిక ఫ్లెక్సీల కలకలం రాజు మృతిపై బీజేపీ సంతాపం!

Nalgonda: నల్గొండలో అక్రమ ఫ్లెక్సీలు కడుతూ రాజు అనే వ్యక్తి మృతి చెందడంపై బీజేపీ నాయకుడు పిల్లి రామరాజు సంతాపం. బాధ్యులపై చర్యలకు డిమాండ్.

Saleem, Nalgonda
Published on: 24 Aug 2026 7:55 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో అనధికారిక ఫ్లెక్సీల కలకలం రాజు మృతిపై బీజేపీ సంతాపం!

Nalgonda: నల్లగొండ జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీలు కడుతూ ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి మృతి చెందిన రాజు కుటుంబానికి బీజేపీ రాష్ట్ర నాయకుడు( నల్గొండ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే ) పిల్లి రామరాజు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకోవాలని, ఈ ప్రమాదానికి కారకులైన వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

​నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ వంశీకృష్ణను కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నాయకులు పోటీపడి అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న ఈ ఫ్లెక్సీలు సామాన్య ప్రజల భద్రతకు తీవ్ర ముప్పుగా మారాయని విమర్శించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story