Suryapet: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే మా లక్ష్యం పటేల్ రమేష్ రెడ్డి!

Suryapet: జెడ్పి బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి విద్యార్థులకు ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లను పంపిణీ చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Updated on: 9 July 2026 5:44 PM IST
Suryapet
X

Suryapet: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే మా లక్ష్యం పటేల్ రమేష్ రెడ్డి!

సూర్యాపేట: విద్యతోనే ఏదైనా సాధ్యమని, విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జెడ్పి బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న ఆర్థిక సహకారంతో పాఠశాలకు ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు అందజేయడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని గురుకులాలు, వసతి గృహాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు.

విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు సాధించి జిల్లాకు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిందని, వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని అద్భుతాలు సృష్టించాలన్నారు.

ఇప్పటికే స్ప్రెడ్ ఇండియా సహకారంతో పాఠశాలల్లో విద్యార్థుల అవసరాలను తీరుస్తున్నామని, ప్రస్తుతం ఈ పాఠశాలకు అవసరమైన డిజిటల్ బోర్డులు, ఎలక్ట్రికల్ బెల్ తో పాటు ఇతర సహాయం కూడా తప్పకుండా అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, వల్లాస్ దేవేందర్, పిల్లల రమేష్ నాయుడు, తండు శ్రీనివాస్ గౌడ్, అరవింద్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story