Suryapet: తుంగతుర్తిలో భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన!
Suryapet: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాలలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన.
Suryapet: తుంగతుర్తిలో భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన!
Suryapet: తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల : రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మద్దిరాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పచ్చిపాల వెంకన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం సమాజానికే సిగ్గుచేటని అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కూడా వారు తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు రేషన్ కార్డులు, పేదలకు ఇళ్ల విషయంలో తగిన న్యాయం జరగలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తున్నామని, పేదల కోసం సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణం చేపట్టి గృహప్రవేశాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో ప్రజా సంపద దుర్వినియోగం జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు.. అక్రమ ఆస్తులపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కూడా వారు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై భవిష్యత్తులోనూ అనుచిత వ్యాఖ్యలు చేస్తే మధిర మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ప్రతిఘటిస్తామని నాయకులు హెచ్చరించారు.




