Nalgonda: బస్‌స్టాండ్‌లో ‘జేబుల దొంగల’ ముఠా రట్టు: ముగ్గురు అరెస్ట్!

Nalgonda: ఆర్‌టీసీ బస్‌స్టాండ్‌లో ప్రయాణికులను దోచుకుంటున్న అంతర్జిల్లా జేబుల దొంగల ముఠా అరెస్ట్. ముగ్గురు నిందితుల నుంచి సెల్‌ఫోన్లు, ఆటో, నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

Saleem, Nalgonda
Published on: 13 Aug 2026 10:50 PM IST
Nalgonda
X

Nalgonda: బస్‌స్టాండ్‌లో ‘జేబుల దొంగల’ ముఠా రట్టు: ముగ్గురు అరెస్ట్!

నల్లగొండ: ఆర్‌టీసీ బస్‌స్టాండ్లలో ప్రయాణికుల్లా నటిస్తూ పిక్‌పాకెటింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్జిల్లా ముఠాను నల్లగొండ II టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఒక ఆటోరిక్షా, ₹3,000 నగదును స్వాధీనం చేసుకున్నాట్లు సీఐ ఆది రెడ్డి తెలిపారు.ఈ ఆపరేషన్ చేపట్టిన II టౌన్ ఎస్‌ఐలు D. సైదా బాబు, G. మానస, ఏఎస్‌ఐ ఉమారాణి, హెచ్‌సీ విజయకుమారి, పీసీలు రాధిక, బాలకోటి, షకీల్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story