Suryapet: సూర్యాపేట వైన్ షాప్‌లో అర్ధరాత్రి చోరీ!
Suryapet: సూర్యాపేట గాంధీనగర్ సమీపంలో 7 లిక్కర్ మార్ట్‌లో అర్ధరాత్రి చోరీ. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నగదు, ఖరీదైన మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లిన దుండగులు.
Suryapet: సూర్యాపేట వైన్ షాప్‌లో అర్ధరాత్రి చోరీ!
Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సూర్యాపేట-జనగామ ప్రధాన రహదారిలో గాంధీనగర్ సమీపంలో ఉన్న 7 లిక్కర్ మార్ట్ లో అర్ధరాత్రి చోరీ జరిగింది.
గుర్తు తెలియని దుండగులు మొదట షాపులో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించి, షట్టర్ వెనుక భాగంలో ఉన్న తలుపు బేడం తొలగించి షాపులోకి చొరబడ్డారు. షాపులో ఉన్న సుమారు రూ. 10,000 నగదు, ఖరీదైన మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లి పరారయ్యారు.
తెల్లవారుజామున షాపును శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్ చోరీ జరిగినట్లు గమనించి యజమానికి సమాచారం ఇచ్చాడు. దీంతో బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇది అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పనే అయి ఉండవచ్చని వైన్ షాప్ యాజమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.




