Nagarjuna Sagar: నాగార్జునసాగర్ వద్ద మళ్లీ రాజుకున్న తెలుగు రాష్ట్రాల జల వివాదం!

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ వద్ద కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండా ఏపీ నీటిని విడుదల చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోటీగా తెలంగాణ అధికారులు ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు.

Saleem, Nalgonda
Published on: 26 Aug 2026 4:10 PM IST
Nagarjuna Sagar
X

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ వద్ద మళ్లీ రాజుకున్న తెలుగు రాష్ట్రాల జల వివాదం!

నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ జల వివాదం రాజుకుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేయడం తీవ్ర కలకలం రేపింది. తెలంగాణ నిర్వహణలో ఉన్న ప్రాజెక్టు వద్ద ఏపీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడంపై స్థానిక అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

​ఏపీ వైఖరిని నిరసిస్తూ, పోటీగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కూడా ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ హఠాత్ పరిణామంతో సాగర్ వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అనుమతులు లేని నీటి విడుదలను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ అధికారులు స్పష్టం చేయగా, ప్రాజెక్టు పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story