Nalgonda: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లు పూర్తి చేసిన కలెక్టర్ చంద్రశేఖర్

Nalgonda: రేపు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్.

Saleem, Nalgonda
Published on: 16 Sept 2026 6:31 PM IST
Nalgonda
X

Nalgonda: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లు పూర్తి చేసిన కలెక్టర్ చంద్రశేఖర్

నల్గొండ: జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో గురువారం నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ’ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు.

ఈ వేడుకలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలిసి మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు.

​అధికారులు, సిబ్బంది ఉదయం 9:30 గంటలకే మైదానానికి చేరుకోవాలని ఆదేశించారు. పతాకావిష్కరణ అనంతరం మంత్రి సందేశం, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda