Nakrekal: : బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం!
Nakrekal: సెప్టెంబర్ 05న సీఎం రేవంత్ రెడ్డి నకిరేకల్ పర్యటన సందర్భంగా మినీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు.
Nakrekal: : బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం!
Nakrekal: గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నకిరేకల్ నియోజకవర్గంకు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు విచ్చేస్తున్న నేపథ్యంలో, పట్టణం మినీ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా సభ ప్రాంగణంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, వేదిక నిర్మాణం, ప్రజలకు కల్పించాల్సిన తాగునీరు, పార్కింగ్, భద్రత, విద్యుత్ సౌకర్యం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు, మున్సిపల్, పోలీస్, R&B శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు. భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




